Thursday, August 23, 2007

పర్యావరాణాన్ని కాపాడండి

ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలలో పర్యావరణ సమస్య ఒకటి. కేవలం మనమే మన చేతులారా పర్యావరణానికి హాని చేస్తున్నాము. దీనివల్ల భూమిపై కాలుష్యం పెరిగి ఎన్నో దుష్పరిణామలు ఏర్పడుతున్నాయి. కావున దీనికి మన వంతుగ మన చేతనైనంతలో మనం కొన్ని చిట్కాలు పాటించి ఈ అవనికి మన వంతు సేవ మనం చేద్దాం.

మనకు తెలుసు ఈ రొజుల్లో మన జీవితాలతో కంప్యూటర్లు ఎంతగా పెనవేసుకొని పొయాయో. కాని ఈ కంప్యూటర్ల వల్ల పర్యావరణానికి చాల హాని కలుగుతుందంటే మనలో చాల మందికి ఆశ్చర్యముగా ఉండొచ్చు. మనం కంప్యూటర్లు ఉపయోగించినప్పుడు అది వాడుకునే విద్యుశ్చక్తిని తయారు చేయడానికి ఇంధనాలు మండించడమో లేక మరేదో మార్గమ్లో పర్యావరణానికి హాని కలుగుతుంది.

మీరు నమ్మండి నమ్మక పొండి, మనం సాధారణముగా ఉపయోగించే డెస్కుటాప్ పి.సి. కి సరఫరా అయ్యే విద్యుతులో సగం వరకు వ్రుధా అవుతుంది. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఇవి ఉపయోగించే విద్యుత్ ని గణనీయముగ తగ్గించ వచ్చు. ఒక సర్వే ప్రకారం తేలిందేంటంటే డెస్కుటాప్ పి.సి.లు వాడే విద్యుత్లో సుమారు 70%-80% వరకు మనం ఆదా చేయవచ్చు. ఆ చిట్కాలేవో ఇక్కడ చూద్దామా?

1. మనమ్ కంప్యూటర్ని ఉపయోగించనప్పుడు మానిటర్ని స్విచ్చ్-ఆఫ్ చేయడం.

2. మన మానిటర్లో బ్రైట్నెస్ ని వీలు అయినంతగా తగ్గించడం.

3. మన కంప్యూటర్లో పవర్ మానెజిమెంట్ ఫీచర్ ని ఆన్ చేయదం. ఈ రొజుల్లో లభించే దాదాపు ప్రతి కంప్యూటర్లో కూడా పవర్ మానేజిమెంట్ ఫీచర్ ఉంటుంది. దానిని సరిగ్గా కాన్ఫిగర్ చేయడం ద్వారా మన కంప్యూటర్ ఉపయోగములో లేనప్పుడు దానంతట అదే ఆగిపొవడం లేదంటే కేవలం మానిటర్ ఒకటే స్విచ్-ఆఫ్ కావడమ్ జరుగుతుంది.

4. ఇంక చివరగ మనం కొత్త కంప్యూటర్లు కొనేముందు అవి తప్పని సరిగా ఎనర్జి-స్టార్ 4.0 కంప్లైంట్ ఉండేలా చూడండి.

4 comments:

రవి వైజాసత్య said...

మీరన్నవేవీ పర్యావరణానికి ఏమాత్రం ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు కానీ..మీకు కొన్ని పైసలు ఆదా చేస్తాయి..మీ మానిటరు కొంత కాలం ఎక్కువ మన్నుతుంది.
(మీకు ఆదా అయ్యే డబ్బుకంటే సమయమే ముఖ్యమనుకుంటే అది వేరే విషయం)

Srini said...

రవి గారు, మనం ఒక్కరమే వీటిని పాటిస్తే పెద్దగా ఉపయోగముండకపొవచ్చు కాని కంప్యుటర్లు ఉపయోగించే అందరూ కూడా పాటిస్తే తప్పకుండ మనం ఎంతో విద్యుత్ని ఆదా చేసిన వాల్లం అవుతాం.

విహారి(KBL) said...

కంప్యుటర్ కార్బన్ మొనాక్షిడ్ విడుదల చేస్తాయి. అందుకే వాడనప్పుడు ఆఫ్ చేస్తే మంచిది.అంతే కాదు ఆఫ్ చేసినప్పుడు ప్లగ్ బోర్ద్ నుంచి ప్లగ్ తీసి వెయ్యాలి.ఇలా రీమూవ్ చెయ్యటం వల్ల కుడా కొంత(లిటిల్ ఎమౌంట్)పవర్ సేవ్ చెయ్యవచ్చు.

Naga said...

ఇష్టమొచ్చినట్టు కాగితాలపై ప్రింటు చేయడం మరొక ముఖ్య విషయం.