Friday, July 13, 2007

అమెరికా జీవితం

అమెరికా జీవితం గురించి నాకు కలిగిన అభిప్రాయం.

ఇక్కడ అమెరికాలో మనకు సెల్ఫోన్,కార్,ఇంటర్నెట్ ఎంతగా అవసరమో మూడు వాక్యాల్లో నా ఫీలింగ్.

1. సెల్ఫోన్ లేదు అంటే మన పరిస్థితి మూగ,చెవిటి లాంటిది.
2. కార్ లేదు అంటే మన పరిస్థితి వికలాంగుల పరిస్థితే.
3. ఇంక చివరగా ఇంటర్నెట్ లేదు అంటే మనం గుడ్డీ వాళ్ళ కిందే లెక్క.

నేను ఇక్కడకి వచ్చి ఇప్పటికి దాదాపు నెల రోజులు కావొస్తుంది. నాకు పైన చెప్పిన వేవి లేవు. ఈ నెల రోజుల్లో నేను అనుభవించిన కష్టాలు నాకు ఈ ఫీలింగ్ కలిగించాయి.

6 comments:

రాధిక said...

మీరు చెప్పింది 100% నిజం.మాకూ వున్నది ఇలాంటి అనుభవం.

కొత్త పాళీ said...

సెల్ఫోన్ విషయంలో ఈ పరిస్థితి ఇక్కడి కన్నా భారతంలోనే ఎక్కువగా కనిపిస్తుంది.

మిగతా రెండు విషయాల్లో మీతో ఏకీభవిస్తాను. న్యూయార్క్, ఫిలడెల్ఫియా, షికాగో, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్ని మినహాయిస్తే కారు లేకపోవడం కాళ్ళు లేకపోవడమే.

Bujji said...

కనీసం టెలివిజన్ అయినా వుంది అనుకుంటున్నాను.....బుజ్జి

Unknown said...

భావకవి భారమైన భావాలు భారతీయులకు బాధ కలిగించే భరించ లెని నిజాలు ...కాని ఇవి వస్తవాలు..

బ్లాగేశ్వరుడు said...

శ్రీనివాస్ గారు మీరు చెప్పింది యదార్థం, ఏమి లేకపోయినా ఇంటర్నట్ లేకపోతే రోజులొ ఏది గడవదు. టి.వి. లేకపోయినా ఫరవా లేదు కాని ఇంటర్నెట్ లేదంటే ఇంతే సంగతులు చిత్తగించవలెను

చదువరి said...

బాగా చెప్పారు. నేను మీదేశం వచ్చినపుడు ఆ రెండో బాధ అనుభవించానండి. సెల్లుండేది, నెట్టుండేది. కానీ బయటికెళ్ళాలంటే ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి ఉండేది. అవిటి బతుకని అనుకుంటూ ఉండేవాణ్ణి, నిజంగానే.