Wednesday, April 11, 2007

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు "పట్టుదల" సినిమా కోసం రాసిన ఈ పాట నాకు ఎంతో ఇష్టం. సినిమా అంతగా ఆడకపోవడంతో చాలా మందికి ఈ పాట గురించి తెలియదు. కాని ఒక్కసారి ఈ పాట వింటే మాత్రం మనం ఒక విధమైన ఉత్తేజానికి లోను అవ్వడం ఖాయం. ఎంతటి నిరాశా నిస్ప్రుహళ్లో ఉన్నా కూడా ఈ పాట వింటే మనం కొత్త ఉత్తేజాన్ని పొందుతాము. తీవ్ర నిరాశలో కూరుకుపొయి జీవితాన్ని చాలిద్దాం అని అనుకున్న ఎంతో మంది ఈ పాట విని మనసు మార్చుకొని తిరిగి కొత్త జీవితాన్ని మొదలెట్టారని శాస్త్రి గారే స్వయంగా చెప్పారు.

చిత్రం : పట్టుదల
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : జేసుదాస్
సంగీతం : ఇళయరాజా.

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా.. ఎప్పుడూ

నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా
నిశా విలాసమెంత సేపురా ఉషొదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండెకూడా సూర్యగోళమంటిదేరా..... ఎప్పుడూ

నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా...
నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ.
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది
అంతకన్నా సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
ఆశయమ్ము సారధౌనురా
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
ఆయువంటు ఉన్న వరకు చావుకూడా నెగ్గలేక శవము పైనే గెలుపు చాటురా...........ఎప్పుడూ

నెట్ లో ఈ పాట ఆడియో కోసం ఎంతగానో ప్రయత్నించాను కాని దొరకలేదు. దయచేసి ఎవరి దగ్గరైనా ఈ పాట MP3 లేదా Real ఫార్మాట్ లో ఉంటే దయచేసి నాకు పంపగలరు.

మరిన్ని మంచి పాటలతో మరోసారి కలుసుకుందాం.

సెలవు...

Tuesday, April 10, 2007

అమ్మ చేతి వంట

నాకు తెలిసి ఈ స్రుష్ఠిలో అన్నింటికన్నా రుచికరమైన పధార్థం ఏంటంటే "అమ్మ చేతి వంట". మిగతా వారి సంగతి ఏమో కాని నాకైతే అమ్మ చేతి వంటకి సాటి ఏదీ రాదు. నా చిన్నప్పుడు అమ్మ నాకు అన్నం, పెరుగు, చింతకాయ పచ్చడి కలిపి ఇస్తే ఎంతో ఇష్టంగా తినేవాడిని. కాని అవే అయిటంస్ నేను కలుపుకొని తింటే అంత రుచిగా అనిపించేది కాదు. అప్పట్లొ నేను బాగా ఆలోచించేవాడిని ఏంటబ్బ ఇందులోని గమ్మత్తు, సేం అయిటంస్ అమ్మ కలిపి పెడితే ఎంతో రుచిగా వున్నాయి, కాని నేను కలుపుకొని తింటే మాత్రం అంత రుచిగా లేవు. అదే మరి అమ్మ చేతి మహత్యం అంటే....

మనం ఎప్పుడూ ఇంట్లోనే వుంటూ అమ్మ చేతి వంట తింటుంటే మనకు దాని విలువ తెలీదు. ఎప్పుడైతే మనం ఇంటికి దూరంగా వుంటామో అప్పుడు తెలుస్తుంది. ఇదే అనుభవం నాకు ఎదురయింది, అందుకనే స్వానుభవంతో చెప్తున్నాను.

నేను చిన్నప్పటి నుంచి వంటరిగా వున్నది లేదు. నా చదువులు అన్ని మా స్వంత ఊరిలోనే అయ్యాయి. మధ్యలొ ఒక 3 సం.లు మాత్రం హాస్టల్లో ఉండి చదువుకున్నాను. అందుకని ఎప్పుడూ నాకు వంట చేసుకొని తినే బాధ రాలేదు. కాని పోయినేడాది ఆఫీస్ పని మీద ఒక 2 నెలలు అమెరికా వెళ్లినప్పుడు తెలిసింది అమ్మ చేతి వంట విలువేంటో.

నేను అమెరికా వెళ్లక ముందు వరకు కూడా ఎప్పుడూ మ్యాగీ తిన్నది లేదు. నాకు మన సంప్రదాయ టిఫిన్స్ అయిన ఉప్మా, ఇడ్లీ, వడ ఇవే బాగా నచ్చుతాయి. కాని బర్గర్స్, పిజ్జాస్, మ్యాగీస్ ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండవు. మా వాళ్లంతా వండుకోవడం సులువు అని చెప్పి ఒక డజన్ మ్యాగీ పాకెట్స్ నా లగేజ్ లో పెట్టారు. మా అద్రుష్టం కొద్దీ మా హొటల్ పక్కనే మెక్ డోనాల్డ్స్ వుంది. సో అక్కడికి వెల్లగానే మొదటి వారం రోజులు మెక్ డోనాల్డ్స్ లోనే తినేవాళ్లం. అలా ఒక వారం రోజులు తినే సరికి అది కాస్తా మొహం మొత్తింది. ఇంక అప్పుడు మనం వంట చేసుకొని తినాలి అని డిసైడ్ అయ్యాను. అసలు అమెరికా లో వంట చేసుకుందామనే నాకు ఇష్టమైన కూరలు, పప్పులు అన్ని ఇంట్లో వాళ్లతో ఎలా చేయాలో రాయించి మరీ తీసుకెల్లాను ఒక వంటల పుస్తకం.

సరే ఫ్రెష్ గా వారం మొదటి నుంచి మొదలుపెడదామని సోమవారం ఉదయం పొద్దున్నే మ్యాగీ చేసాను. జస్ట్ దాని మీద ఉన్న సూచనలు చదవడం, చేయడం అంతే. చాలా సులువుగా అనిపించింది. అదే మొదటిసారి నేను మ్యాగీ చేయడం, తినడం. అంతకు ముందు రాత్రి సరిగ్గా తిని వుండక పొవడం, పైగా అది మన స్వయం పాకం కావడం, మొదటిసారి ఆ రుచి చూడ్డంతో తినగానే బాగానే అనిపించింది. ఇదేదో బాగుంది కదా అని మొత్తం లాగించేసాను. అప్పుడు దాని రుచి నచ్చింది, సరే ఇదేదో సులువుగా వుంది చేయడం, మధ్యాహ్నం కూడ దీనితోనె కానిచ్చేద్దాం అని రెచ్చిపోయి ఇంకో ప్యాకెట్ మ్యాగీ మళ్లా అప్పుడు వండాను. అలా వండి దానిని నా టిఫిన్ బాక్స్ లొ సర్ది దానినే స్టయిల్ గా ఆఫీస్ కి తీసుకెళ్లాను.

సరే ఇంక మధ్యాహ్నం లంచ్ సమయం అయింది. మన స్వయం పాకం మన దగ్గర వుంది కదా, ఇంక కాంటీన్ కి వెల్లడం ఎందుకు దండగ అని, ఆఫీస్ కిచెన్ లోకి వెళ్లి ఒక కోక్ తెచ్చుకున్నాను. అక్కడే సీట్ లోనే కూర్చోని మ్యాగీ విత్ కోక్ లాగించ్చేద్దాం అని నా టిఫిన్ బాక్స్ మూత తెరిచాను. ఇంకేముంది ఆ మ్యాగీ కాస్తా గట్టిగా అయింది. ఇంక అప్పుడు వేరే దారి లేదు, చచ్చినట్టు అదే తినాల్సిందే. అప్పుడు నా బాధలు ఇంక ఆ భగవంతుడికే తెలియాలి. కొద్ది కొద్దిగా దానిలో నీళ్లు పోసుకుంటూ, ముద్ద ముద్దకు కోక్ తాగుతూ బలవంతంగా మ్యాగీ మొత్తం తినేసాను. అప్పుడు నిజంగా అనిపించింది "అబ్బా, ఎందుకు వచ్చామురా బాబు ఇక్కడికి" అని. ఆ దెబ్బతో మళ్లీ మ్యాగీ అంటేనే విరక్తి వచ్చేసింది. ఆఫ్ కోర్స్ తర్వాత కొన్ని సార్లు తప్పని సరి పరిస్తితుల్లో మ్యాగీ తిన్నాను, తింటున్నాను కూడా.

మొత్తానికి అలా అమెరికా అనుభవాలతో ఏదో కొద్దిగా వంట అదీ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను వంట బ్రహ్మండంగా చేయలేకపోయినా చెత్తగా మాత్రం చేయను. కాని నాకు వీలు ఉన్నంతవరకు అమ్మ చేతి వంట తినడానికే ప్రయత్నిస్తాను.

Tuesday, April 03, 2007

Whom to blame for India's defeat in World Cup?

వరల్డ్ కప్ లో మన ఇండియా ఓటమికి భాధ్యులు ఎవరు?

ఈ ప్రశ్నకు బాగా బాగా ఆలోచించగా నాకు సమాధానం దొరికింది.
అదేంటొ చూడాలంటే కిందికి స్క్రోల్ చేయండి.

..
..
..
..
..
..
..
..
..
..


..

..


..
..

..

దీనికి కారణం ఒకరు, ఇద్దరు కాదు. ఆక్షరాలా ముగ్గురు. వారే1. ఇందిరా గాంధి2. హనుమంతుడు3. బెర్ముడా ఆటగాళ్లు.
ఎందుకంటే
1. ఇందిరా గాంధి నే కదా బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణం.
2. హనుమంతుడు అప్పట్లో లంకను పూర్తిగా తగలెట్టలేదు.

3. ఇక చివరగా బెర్ముడా ఆటగాళ్లు ఎంతో కీలకమైన మ్యాచ్ లో చాలా చెత్తగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేసి ఓడిపోయారు. అదేనండీ వాళ్ల చివరి మ్యాచ్ బంగ్లాదేశ్ తో.
[ఈ పొస్ట్ నాకు వచ్చిన ఒక మెయిల్ ఆధారంగా రాయడం జరిగింది]

Sunday, April 01, 2007

April Fool !!!

చిన్నప్పుడు స్కూల్ లో ఉన్నప్పుడు ఏప్రిల్ 1 వస్తుంది అంటే అదోలా ఉండెది. ఎందుకో తెలుసా, ఆ రోజే నా పుట్టిన రోజు. పుట్టిన రోజు కదా అని ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ గట్రా ఇద్దామని అనుకంటే ఎవరూ తీసుకునే వారు కాదు. నేనేదో ఏప్రిల్ ఫూల్ చేస్తున్నానని పెద్ద అనుమానం వెధవలకి. నాకేమో ఆ రోజు కొత్త బట్టలు వేసుకోవాలని, అందరికి చాక్లెట్స్ అవీ ఇచ్చి వాళ్లంతా గ్రీటింగ్స్ చెప్తుంటే అందుకోవాలని ఉండేది. అలా కొన్నాళ్లు గడిచాక ఇంక లాభం లేదు అని ఏప్రిల్ 1 నాడు స్కూల్ లో పుట్టిన రోజు చేసుకోవడం మానేసాను.

Thursday, March 29, 2007

Happy Birthday Teja

హ్యపీ బర్త్ డే తేజ

ఈ రోజు తేజ రెండవ పుట్టిన రోజు, చూస్తూ ఉండగానే అప్పుడే 2 సంవత్సరాలు అయ్యాయి. టైం చాలా తొందరగా గడిచిపొతుంది. ఇంక తనని ఈ జూన్/జూలై లో ప్లే స్కూల్లో వేయాలి. చూడాలి స్కూల్ కి వెళ్లడానికి ఎంత పేచీ పెడుతుందో.

Saturday, October 14, 2006

Useful and Unknown Feature of Acrobat

Most of us dont know that Adobe reader 7.0 and above has the capability to read the PDF documents. We can listen to any PDF document with Acrobat Reader 7.0 and above.

These are the commands to play/pause/stop the reading of document.

Ctrl + Shift + b = To hear the entire document
Ctrl + Shift + v = To hear the current page
Ctrl + Shift + c = To resume the reading
Ctrl + Shift + e = To stop the reading

Just open any PDF file in reader and try, hope you will surprise like me...

Friday, October 13, 2006

Classic joke on the difference of friendship between men and women.

Friendship between women:
A woman didn't come home one night. The next day she told her husband that she had slept over at a girlfriend's house. The man called his wife's 10 best friends. None of them knew anything about it.

Friendship between men:
A man didn't come home one night. The next day he told his wife that he had slept over at a buddy's house. The woman called her husband's 10 best friends.

Eight of them confirmed that he had slept over, and two claimed that he was still there.