Friday, February 05, 2010

తెలంగాణా వచ్చాక

తెలంగాణా వచ్చాక మన సినిమాలు...
౧. నరసింహ నాయుడు - నర్సింగ్ యాదవ్.
౨. పరుగు - ఉరుకు
౩. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి - గాడ పోరి గీడ పోరడు
౪. సిద్దు ఫ్రం శ్రీకాకుళం - మల్లేష్ ఫ్రం మల్కాజిగిరి
౫. చాలా బాగుంది - జాబర్దస్తుంది
౬. అవునన్నా కాదన్నా - ఔ మల్ల లే మల్ల
౭. సంక్రాంతి - బోనాలు
౮. అమ్మాయిలు అబ్బాయిలు - పోరిలు పోరగాల్లు
౯. పల్నాటి బ్రహ్మనాయుడు - కరీంనగర్ KCR
౧౦. నారి నారి నడుమ మురారి - పోరి పోరి నడుమ తివారి
౧౧. చంటబ్బాయి - చిన్న పోరడు
౧౨. పులి - షేర్
౧౩. ౪౭ రోజులు - ౪౭ దినాలు
౧౪. మా నాన్నకు పెళ్లి - మా అయ్యకు లగ్గం
౧౫. ఇడియట్ - దేడ్ దిమాక్ గాడు
౧౬. వరుడు - పెండ్లి కొడుకు
౧౭. పోకిరి - ఫాల్తు బాడ్కావ్
౧౮. మరణ మృదంగం - సావు డప్పు
౧౯. హ్యాపీ డేస్ - కుషి దినాలు
౨౦. ఆవిడా మా ఆవిడే - గామే భి నా పెండ్లామె

16 comments:

Chandamama said...

సరదాగా చాలా బాగున్నాయ్!

King said...

మీరేమైనా గ్రాంధిక తెలుగు మాట్లాడుతారా ... మా భాష మీకు నచనట్లే...మీ యాస మాకు నచ్చదు... వీటి కన్నింటికి ప్రతీకారం జరుగుతుంది... ఒక్కసారి తెలంగాణ రానివ్వండి.. ఇక మీకు.. మొదలైతది...

Srini said...

ధన్యవాదాలు చందమామ గారు.
నాయన కింగ్, ఇది కేవలం సరదాగా రాసింది మాత్రమే, ఇది ఎవరిని కించపరచడానికి కాదు, అసలా మాట కొస్తే నేను కూడా తెలంగాణా వాడినే..

నాగప్రసాద్ said...

LOL :) Super. :) :)

"పోరి పోరి నడుమ తివారి". హ హ హ . అదరగొట్టేశారండి. మస్తుగ జెప్పినవ్. :))))

Malakpet Rowdy said...

"పోరి పోరి నడుమ తివారి"
___________________


LOL ... this is ultimate

Sandeep P said...

ఈ టప చదివి నేను నవ్వుకున్నాను. ఈ మధ్యన forwardsలో కూడా బాగా కనిపించింది.

నేను ఆంధ్రాజిల్లాలనుండి వచ్చినవాడినైనా, ఇతరుల మనోభావాలను కించపరిచే అవకాశం ఉన్న టపలను చెయ్యద్దనే (అడిగితే) సలహా ఇస్తాను. మనం అనుకునే హాస్యం ఇతరులకు అపహాస్యంగా తోచి వాళ్ళు బాధపడటం దేనికి?

రచయిత నా మాటల్ని తప్పుగా భావించకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను. జై హింద్.

bhee bhoo said...

this is copied ...put credits for original uploader

Srini said...

@నాగ ప్రసాద్, మలక్పేట్ రౌడీ
ధన్యవాదాలు.
@సందీప్
మీ కామెంట్ కి ధన్యవాదాలు. నేను కూడా సామాన్యంగా ఇతరుల మనోభావాలు బాధపడేలా ఉన్న టపాలను ఎప్పుడు వీయను, కాని ఇందులో కేవలం సరదా మాత్రమె నాకు కనపడింది. నాతొ పాటు అందరు కాసేపు సరదాగా నవ్వుకుంటారు కదా అని దీనిని పబ్లిష్ చేశాను.

మంచు said...

హ హ హ .. భలే వున్నాయ్.. నాకు పొరి పొరి నచ్చింది..

Srini said...

@మంచు పల్లకి
ధన్యవాదాలు

Anonymous said...

what is the big deal
It was only true translation into a different dilect.
i enjoyed laughed my stomach uot!!!!!

రవిచంద్ర said...

శభాష్ చాలా సరదాగా రాశారు. కడుపుబ్బ నవ్వుకున్నాం.
అయినా సరదా విషయాలు సరదాగా తీసుకోని వారి వ్యాఖ్యలు అసలు ప్రచురించద్దు.

నిజం said...

చాల బాగుంది translation ....... పోకిరి - ఫాల్తు బాడ్కావ్ :)
ఆవిడా మా ఆవిడే - గామే భి నా పెండ్లామె( గామే కూడా నా పెండ్లామె) అంటే బాగుంటుందేమో ......

Anonymous said...

కేక మామా

Anonymous said...

mastugunnadanna........ telangana vachinanka alla sangati sepdaam anna.............

Madhu said...

telangaana bhaasha manchiguntadi kada annaa............ naaku telangaana ante enta ishatamooooooooo..............